calender_icon.png 17 February, 2026 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో చేరిన మున్సిపల్ చైర్‌పర్సన్

17-02-2026 01:16:31 AM

కండువా కప్పి స్వాగతించిన సుదర్శన్‌రెడ్డి

ఆదిలాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సరైనదేనని ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల పార్ల మెంట్ ఇంచార్జి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. అదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్‌గా ఎన్నికైన బండారి అనూష సతీష్ సోమ వారం నిజామాబాద్‌లోని ఆయన నివాసం లో కాంగ్రెస్‌లో చేరారు. వారిని ముందుగా అభినందించి శాలువాలతో సత్కరించారు.

అనంతరం కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. తమది సెక్యులర్ పార్టీ అని ఇతర సెక్యులర్ పార్టీల మద్దతుతో కాం గ్రెస్ పార్టీ అదిలాబాదులో మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం దక్కించుకోవడం హర్షనీ యమన్నారు. ఇందుకు సహకరించిన కౌన్సిలర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆదిలాబాద్ నేతలందరినీ ఆయన అభినందిం చారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి, నాయకులు గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, అశ్విన్ రెడి పాల్గొన్నారు.