ప్రభుత్వ బాలికల పాఠశాల పునఃప్రారంభం
ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలను పునఃప్రారంభం కావడం జరిగింది. గత 15 సంవత్సరాల విద్యార్థులు లేరనే కారణం చేత బాలుర పాఠశాలలో కలపడం జరిగింది. అప్పటి పరిస్థితులలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం లేనందున నాణ్యమైన విద్యను అందించడం కోసం తమ పిల్లలను వారి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రైవేట్ పాఠశాలలో చదివించారు.
క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తో పాటు ఉపాధ్యాయులు మెరుగైన విద్యను అందించడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. కావున బాలికల పాఠశాలను శుక్రవారం గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్ ఘనంగా పునఃప్రారంభించారు. నూతనంగా పాఠశాలలో చేరిన విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఈ ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముస్తాబాద్ ఎంఆర్ఓ ఫారుక్, ఎంపీడీఓ లచ్చాలు, ఎంఈఓ నిమ్మ రాజిరెడ్డి,అలాగే ముస్తాబాద్ ఎస్ఐ జ్యోతి హాజరయ్యారు. ఈ పాఠశాల పునఃప్రారంభానికి ఎంతగానో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో పాఠశాల అందుబాటులో ఉంటేనే పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని,తద్వారా భవిష్యత్తు కూడా బాగుపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదివి ఉన్నతంగా ఎదగాలనికోరుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.






