27 August, 2026 | 2:29 AM

ముంబై తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి

27-08-2026 01:07 AM

తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక (ముంబై) ప్రతినిధులు

ముషీరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ముంబై లో కీలకంగా పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక (ముంబై) ప్రతినిధులు కోరారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి వినతిప త్రం సమర్పించినట్లు తెలంగాణ ఉద్యమ స ంఘీభావ వేదిక ముంబై ఉద్యమకారుల క మిటీ వెల్లడించింది. 

బుధవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక కన్వీనర్ అక్కినపల్లి దుర్గేష్, గొండ్యాల రమేష్, శ్రీనివాస్, సైదులు మాట్లాడుతూ  ప్రతినిధులు మోహన్ రావు, మచ్చ ప్రభాకర్, శ్రీకాంత్ మాట్లాడుతూ 1969, 2009 మలిదశ ఉద్యమాలతో పాటు ముంబైలో తెలంగాణ రాష్ట్ర సాధనకు అనుకూలంగా అనేక సభలు, సమావేశాలు, నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించామని తెలిపారు. 2013 నవంబర్ 30న గోరేగావ్లో సుమారు 10 వేల మంది తో తెలంగాణ బిల్లు సాధన సభ నిర్వహించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ముంబై ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి పాల్గొని సంఘీభావం ప్రకటించారు.