27 August, 2026 | 2:29 AM

మదర్ థెరిస్సా స్ఫూర్తితో ముందుకుసాగాలి

27-08-2026 12:56 AM

మహబూబాబాద్, ఆగస్ట్ 26 (విజయక్రాంతి) : మదర్  తెరిసా స్ఫూర్తితో ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ముందుకు సాగాలని జీవీఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గుండెపాక వెంకన్న పిలుపునిచ్చారు. మదర్ తెరిసా 116వ జయంతి పురస్కరించుకుని బుధవారం జీవిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. మదర్ జయంతిని పురస్కరించుకొని మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మదర్ తెరిసా 116వ జయంతి సందర్భంగా  జివిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోగులకు బ్రెడ్, పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పెన్నిధి మదర్ థెరిస్సా మనదేశంలో పేదవారికి,రోగులకు, అనాధలకు  చేసిన సేవలను  జ్ఞాపకం చేస్తూ మనము కూడా మన దేశము యొక్క క్షేమము కొరకు ప్రేమ, సేవ దృక్పథం కలిగి పేదలైన వారికి, అనాధలకు, వృద్ధులకు, రోగులకు మన వంతు సహాయం చేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో  ఫౌండేషన్ డైరెక్టర్ గుండెపాక సునీత,  మల్లెపాక ప్రణయ్,   సారు ఆజాద్, తదితరులు న్నారు.