1 June, 2026 | 6:15 PM

మల్టీ పర్పస్ విధానం వెంటనే రద్దు చేయాలి

01-06-2026 04:40 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్ యూనియన్ పిలుపుమేరకు  జూనియర్ అసిస్టెంట్ కు వినతిపత్రం అందజేశారు. ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా ధర్నా నిర్వహించారు. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి,సమాన పనికి సమాన వేతనం కనీసం 26,000 చెల్లించాలి. జిపి కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.గ్రీన్ ఛానల్ ద్వారా ఒకటి తారీకునే జిపి కార్మికుల కు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షులు గోరంట్ల వసంత్, అనంతరావు,అజిజ్,సలీం,సుధాకర్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.