18 March, 2026 | 8:15 AM

క్యూలినరీ ఒలంపియాడ్ అంతర్జాతీయ చెస్ పోటీల్లో ముక్కెర దివ్యసారికకు పురస్కారం

17-03-2026 12:00 AM

మేడ్చల్ అర్బన్ మార్చి 16(విజయక్రాంతి): ప్రపంచ చెఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యూలీనరీ ఒలంపియాడ్ అంతర్జాతీయ పోటీలలో గిర్మాపూర్‌కు చెందిన ముక్కెర దివ్య సారికకు పురస్కారం లభించింది. మార్చి 10 తేదీ నుండి 14వ తేదీ వరకు ఢిల్లీలో ఘనంగా నిర్వహించిన ప్రపంచచప్ క్యూలినరీ ఒలంపియాడ్ అంతర్జాతీయ పోటీలలో  మొక్కెర దివ్య సారికకు 5 విభాగాలలో అంతర్జాతీయ పురస్కారం లభించింది.

అంతర్జాతీయ పోటీలలో 7 దేశాల నుండి సుమారు 5000 మంది చెఫ్ లు పాల్గొనగా  ముక్కెర దివ్యసారిక విశేష ప్రతిభ కనబరిచి 5 విభాగాలలో 5 గోల్ మెడల్స్ సాధించి గొప్ప విజయాన్ని అందుకున్నారు.ప్రపంచ చెఫ్ క్యూలినరీ ఒలంపియాడ్ అంతర్జాతీయ పోటీలలో 5 విభాగాలలో గెలుపొందిన ముక్కెర దివ్య సారికకు వరల్ చెఫ్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ రిక్ స్టీఫెన్ ఆమెను అభినందించి అంతర్జాతీయ చెఫ్ ల సమక్షంలో పురస్కారం అందజేశారు.ఈ సందర్భంగా విజేత ముక్కెర దివ్య సారిక సాధించిన ఘన విజయం మేడ్చల్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి గిర్మాపూర్ కు ప్రఖ్యాతలు సంపాదించారు..