calender_icon.png 5 February, 2026 | 3:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం

05-02-2026 01:15:14 AM

11వ వార్డు స్వతంత్ర అభ్యర్థి పెండల మల్లేష్ ముదిరాజ్ 

జిన్నారం/ అమీన్ పూర్ ఫిబ్రవరి 4: కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నన్ను నమ్మించి బీఫామ్ ఇస్తానని మోసం చేసిందని గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోలోని 11వ వార్డు అభ్యర్థి పెండాల మల్లేష్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్తామని హెచ్చరించారు. 11వ వార్డు తనకు కేటాయిస్తే 100 పైచిలుకు మెజారిటీతో గెలిచి చూపించేవాడినన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వివక్ష చూపుతూ టికెట్లు కేటాయించడంలేదని, తనకు టికెట్ రా కుండా కుట్రలు చేశారని ఆరోపించారు.

బడుగు బలహీన వర్గాలకు కొంత మేరకు రాజకీయాల్లో ఉన్నారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే అని కొనియాడారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మచబోయిన లింగం, రామకృష్ణ, వెంకటేష్, ఎల్లయ్య,గోవింద్, జగన్, కుమార్, దశరథ్, రాజు పాల్గొన్నారు.