10 July, 2026 | 10:23 PM

ఏకాదశి లక్ష పుష్పార్చన

10-07-2026 09:20 PM

ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం

స్వామివారి నిత్య రాబడి 24,48,718/-

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవ మూర్తులను వివిధ పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా అలంకరించిన అర్చక స్వాములు ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. సుగంధ పరిమళ పుష్పాలతో లక్ష పుష్పార్చన పాంచరాత్రాగమానుసారంగా నిర్వహించారు.

శ్రీ స్వామి వారి ఆలయంలో  ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.అమ్మవారిని ప్రధాన ఆలయం నందు అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు.  స్వామివారి నిత్య రాబడి 24,48,718/- వచ్చినట్లు ఆలయాలు తెలిపారు.