calender_icon.png 6 February, 2026 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెలాఖరున మృత్యుంజయ్

06-02-2026 02:14:14 AM

‘సామజవరగమన’ చిత్రం తర్వాత శ్రీవిష్ణు, రేబా జాన్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రమిది. లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను ఫిబ్రవరి 27న రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ; డీవోపీ: విద్యాసాగర్; ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: మనీషా ఏ దత్.