బీజేపీ, బీఆర్ఎస్‌పై ఎంపీ చామల తీవ్ర విమర్శలు
బీజేపీ, బీఆర్ఎస్‌కు ఎంపీ చామల కౌంటర్
రాష్ట్రానికి మంచి జరిగితే తప్పు ఏముంది.?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University in the United States), ఎం.ఐ.టీ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో సమావేవశం అయ్యి తెలంగాణ ఇంజనీరింగ్ విద్యానాణ్యతా ప్రమాణాలు, విద్యార్థులకు స్కిల్ డెవలప్ మెంట్ వంటి అంశాలపై చర్చించడంతో పాటు తెలంగాణ విద్యార్థులను(Telangana students) ఏ విధంగా తీర్చిదిద్దాలని ఆలోచనతో లండన్,అమెరికా పర్యటన పెట్టుకున్నారని చామల కిరణ్ కుమార్ వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచద్రరావు, ఎంపీలు ధర్మపురి అరవింద్,రఘు నందన్ రావు సీఎం అమెరికా,లండన్ పర్యటనపై తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014 నుంచి 2023 వరకు సీఎంగా ఉన్న కేసీఆర్(kalvakuntla chandrashekar rao) హైదరాబాద్ ను న్యూయార్క్, కరీంనగర్ ను ఇస్తాంబుల్ చేస్తా, వరంగల్ ను పారిస్ చేస్తానని గాలి మాటలు మాట్లాడారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు వస్తే తప్పు ఏముంది? అని ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పాటు అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావద్దని బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ కేంద్ర విదేశాంగ శాఖతో మాట్లాడాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మంచి జరిగితే తప్పు ఏముంది.? సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై తప్పుగా మాట్లాడిన బీజేపీ ఎంపీలకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ జ్ఞానం నేర్పాలన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఇంజనీరింగ్ విద్యకు(Engineering Education), స్కిల్ కు, ఉద్యోగానికి మధ్య ఉన్న గ్యాప్ ను ఫిల్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తాపత్రయమని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా నెగిటివ్ ప్రచారం చేయాలని బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అజెండాతో కలిసి పని చేస్తున్నాయని భువనగిరి ఎంపీ చామల(Bhongir MP Chamala) కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.






