18 April, 2026 | 11:06 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

పార్టీని పట్టిపీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోండి

19-02-2026 03:37 PM
  1. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మద్దతు
  2. కేసీఆర్ నాశనం చేశారు.. రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు
  3. పార్టీని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలి
  4. కరీంనగర్ ను నిజామాబాద్ తో పోల్చలేం

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(BJP MP Dharmapuri Arvind) అన్నారు. కేసుల మాఫీ కోసమే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. గతంలో కేసీఆర్ అవినీతిని ఎవరూ ప్రశ్నించవద్దని ఎమ్మెల్యేలను కొన్నారని అర్వింద్ వెల్లడించారు. కేసీఆర్ వ్యవస్థను నాశనం చేశారు.. రేవంత్ రెడ్డి ఇప్పుడు కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఎవరు ఎవరి వల్ల భూస్థాపితం అయ్యారో కవితకు తెలియదా? అని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. 20 ఏళ్ల నుంచి పార్టీని పట్టిపీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. మెట్ పల్లిలో కోవర్టు వెళ్లిపోయారు.. పార్టీకి పట్టిన పీడ పోయిందని చెప్పారు. కరీంనగర్ ను నిజామాబాద్ తో పోల్చలేమని అర్వింద్ తెలిపారు. నిజామాబాద్ లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. ఎంపీ అర్వింద్, రామచందర్ రావు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకుని రాష్ట్ర  కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించారు.