28 August, 2026 | 9:51 AM

పత్తి క్షేత్రాలను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం

28-08-2026 01:03 AM

హాజీపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని సబ్బేపల్లి గ్రామంలో కపాస్ క్రాంతి పథకం (NCP)లో భాగంగా అధిక సాంద్రత పత్తి క్షేత్రాలను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం జగిత్యాల శాస్త్రవేత్తల బృందం గురు వారం క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ క్షేత్ర ప్రదర్శనలో రైతులనుద్దేశించి శాస్త్రవేత్తలు మాట్లాడుతూ అధిక సాంద్రత పత్తి సాగులో శాస్త్రీయ పద్ధతులను అవలంబించి, అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం ఎలా సాధించాలో అవగాహన కల్పించారు. పత్తిలో రసంపిల్చు పురుగుల నివారణకు ఎకరాకు ఇమిడాక్లోప్రిడ్ 60 ml, ఆసియామీప్రైడ్ 50 గ్రాములు పిచికారి చేయాలని, వరిలో కాండము తొలుచు పురుగు నివారణకు క్లోరాంట్రానిప్రోనిల్ గుళికలు, జామ పంటలో పండు ఈగ నివారణ కు డైమెథయిట్ 30% 250 గ్రామాలు ఎకరాకు పిచికారి చేయాలని సూచించారు. ఈ క్షేత్రప్రదర్శనలో శాస్త్రవేత్తలు Dr. N.సాయినాథ్, Dr. K. రాజెష్, Dr. P. రవి, Dr. K. రామ క్రిష్ణ, హాజీపూర్ మండల వ్యవసాయ అధికారి క్రిష్ణ, AEO కొమురయ్య, రైతులు తిప్పని కుమార్ స్వామి, రాజేష్, ప్యాట వినోద్ తదితరులు పాల్గొన్నారు.