7 March, 2026 | 5:56 AM

డబ్బులు మహాప్రభో..

07-03-2026 12:00 AM
  1. మక్కల డబ్బుల కోసం పడిగాపులు
  2. మూడు నెలలైనా అందని డబ్బులు
  3. పట్టించుకోని అధికారులు
  4. రూ.15.66 కోట్ల బకాయిలు
  5. తీవ్ర ఇబ్బందుల్లో రైతులు

తాడ్వాయి, మార్చి 6 (విజయక్రాంతి ) : రైతులు పండించిన ధాన్యాన్ని తామే కొం టాం, రైతులకు సకాలంలో డబ్బులు అం దించి ఆధుకుంటాం, రైతులు తమ ధాన్యా న్ని కాంటా చేసిన నాలుగు నుంచి వారం రోజుల్లో డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తాం అని చెప్పిన ప్రభుత్వం ఆ మాటలకు కట్టుబడి ఉండడం లేదు.రైతులకు మద్దతు ధర అందించి రైతులను మధ్య దళారుల నుంచి ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదు. దళారుల నుంచి ఆదుకోవడం ఏమిటో కానీ అసలుకే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

మద్దతు ధర వస్తుందని ఆశ పడ్డ రైతులకు నిరాశే మిగిలింది. మద్దతు ధర కోసం  ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేం ద్రాలలో రైతులు మక్కలు విక్రయించారు తమకు డబ్బులు సకాలంలో అందుతాయని,తమ సమస్యలు పరిష్కరించుకోవ చ్చన్న ధీమాతో కొనుగోలు కేంద్రాల్లో మక్కలను అమ్ముకున్నారు. కానీ ప్రభుత్వ నిర్ల క్ష్యపు వైఖరి కారణంగా రైతులకు డబ్బులు అందడం లేదు.

ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో రైతులు ఈ సీజన్ లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనుగోలు కేంద్రంలో మక్కలు విక్రయించారు. మొత్తం 1 లక్ష 63 వేల 859 బస్తాలను అమ్ముకున్నారు. ఒక్కో బస్తా కు 50 కిలోల చొప్పున 81,929.50 క్వింటాళ్ల మక్కలను విక్రయించారు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధరగా క్వింటాల్ కు రూ.2,400 నిర్ణయించింది.

బయట మార్కెట్లో మక్కలను అమ్ముకుంటే ఒక క్వింటాలుకు రూ.500 నుంచి రూ.600 రూపాయలు నష్టపోతామనుకున్న రైతులు ప్రభుత్వము ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలను విక్రయించారు.కానీ రైతులు మక్కలను అ మ్ముకున్నంత సంతోషం తర్వాత కరువైంది. వారం రోజులు, 15 రోజులు, నెల రోజులు గడుస్తున్నా డబ్బులు అందకపోవడంతో డబ్బుల కోసం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ డబ్బులు మాత్రం బ్యాంకు ఖాతాలలో జమ కావడం లేదు.మక్కల డబ్బులు బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయని ప్రతిరోజు బ్యాంకులకు వెళ్లి ఖాతాలను చూసుకుంటున్నారు.

ఖాతాలలో డబ్బులు జమ కాకపోవడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే తమ వద్ద సమాచారం లేదని వస్తాయని దాటవేస్తున్నారు. ఈ విషయమై రైతు లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన మక్కలకు వెంటనే డబ్బులు జమ చేయా ల్సి ఉండగా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడుతున్నారు. 

మూడు నెలలు అయినా అందని డబ్బులు..

రైతులు మక్కలు విక్రయించి మూడు నెలలు దాటిపోతున్న ఇప్పటికీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. తాము ఎంతో కష్టపడి మక్కలను పండించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే ప్రభుత్వం డబ్బులు అందించకుండా మీన మేషాలు వేస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు లు వస్తే తమ సమస్యలు తీరిపోతాయని అనుకున్న రైతులకు నిరాశే మిగిలింది.పంట పండించుట కోసం చేసిన అప్పులు సైతం తీర్చలేక పోతున్నామని రైతులు బోరుమంటున్నారు. 

రూ 15.66 కోట్ల బకాయిలు..

రైతులు మొక్కజొన్న కేంద్రాల్లో విక్రయించుకున్న మక్కల డబ్బులు మొత్తం రూ. 19.66 కోట్ల రూపాయలు రావాల్సి ఉండ గా, ఇప్పటివరకు కేవలం 20 శాతం రూ. 4 కోట్లు మాత్రమే డబ్బులు రైతుల ఖాతాల్లో జమాయ్యాయి. మిగతా రూ.15.66 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది.దీంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసింది మరొకటిగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమ అవసరాలు తీరుతాయని మక్కలను అమ్ముకుంటే ప్రభుత్వం డబ్బులు అందించకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు వాపోతున్నారు.ధీంతో తమ అవసరాలు తీరనిలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మూడు నెలలు దాటుతున్నా డబ్బులు ఇవ్వరా..

ప్రభుత్వం ఏర్పాటు చేసి న మక్కలు కొ నుగోలు కేం ద్రంలో రైతు లు మక్కలను విక్రయించి ఇప్పటికీ మూడు నెలలు దాటిపోయింది. అయినా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంలో పూర్తిగా విఫలమైంది. రైతులకు డబ్బులు అందించకపోతే ఎలా రైతు లు ఎన్నో సమస్యలతో బాధపడుతుంటారు. రైతులకు ఎన్నో అవసరాలు ఉంటాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణిని వదిలిపెట్టి వెంటనే రైతులకు రావలసిన మక్కల డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయాలి. లేని యెడల రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం.

 నల్లవెల్లి కపిల్ రెడ్డి, తాడ్వాయి సింగిల్ విండో మాజీ చైర్మన్