7 March, 2026 | 8:37 AM

పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే మల్లారెడ్డి

07-03-2026 12:00 AM

మేడ్చల్, మార్చి 6 (విజయ క్రాంతి): మూడు చింతలపల్లి లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జాము రవి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. పీర్జాదిగూడ పి అండ్ టీ కాలనీలో వెంకటేశ్వర స్వామి విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్టపణ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు.