25 August, 2026 | 6:56 PM

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత

25-08-2026 05:33 PM

ఎల్లారెడ్డి మండలంలో,పలు గ్రామాల్లో వన మహోత్సవానికి శ్రీకారం

పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతకు మొక్కలు ఎంతో అవసరం

మిసంపల్లి రైతు వేదిక ప్రాంగణంలో మొక్కలు నాటిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్

ఆర్డీవో,తహసీల్దార్ ఎంపీడీవో, ఎడిఏ,పలువురు అధికారులు

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని మిసంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు వేదిక వద్ద ఎంపీడీవో తాహీరా బేగం ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పచ్చని చెట్టు ప్రగతికి  మెట్టు అంటూ ఆమె తెలిపారు. గ్రామ సర్పంచ్,మరియు ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, పాల్గొని మొక్కలు నాటారు. వనమహోత్సవం కార్యక్రమంలో ఆర్టీవో ప్రభాకర్ తాసిల్దార్ ప్రేమ్ కుమార్, పలువురుఅధికారులు, పాల్గొన్నారు.

మీసంపల్లి రైతు వేదిక వద్ద మొక్కలు నాటిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాహెరా బేగం మాట్లాడుతూ, పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అంటూ ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు చొప్పున రెండు మొక్కలు నాటాలని చెట్లు రచ్చగా ఉంటే ప్రజలందరూ సంరక్షణలో ఉంటారని ఆమె తెలిపారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన అనంతరం ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతకు మొక్కలు ఎంతో అవసరమని  అన్నారు. వన మహోత్సవంలో భాగంగా మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ప్రకృతి వనం తదితర ప్రాంతాల్లో నాటనున్నట్లు పేర్కొన్నారు. ఇంటింటికీ పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేస్తామని తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, మొక్క నాటడంతో పాటు మీరే కాకుండా మరో వ్యక్తితోనూ మొక్క నాటించాలని పిలుపునిచ్చారు. కుటుంబ వేడుకల సందర్భంగా మొక్కలు నాటే సంప్రదాయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో, పలు శాఖాలకు చెందిన సంబంధిత అధికారులు పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.