జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను కలిసిన యాదవ ఉత్సవ కమిటీ
25-08-2026 05:22 PM
జనగామ,(విజయక్రాంతి): శ్రీకృష్ణాష్టమి ఉత్సవాల ఆహ్వానంలో భాగంగా శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా యాదవులు మంగళవారం రోజున హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సెప్టెంబర్ 4న జనగామలో జరగనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరుకావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపి, వేడుకలకు తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






