5 August, 2026 | 12:01 PM

బాధిత కుటుంబానికి చేయూత

05-08-2026 10:56 AM

కారేపల్లి, విజయక్రాంతి: కారేపల్లి మండల కేంద్రం అంబేద్కర్   కాలనీ కి చెందిన  చిరుముల రాములు అనారోగ్యంతో గత వారం క్రితం మృతి చెందారు . వారి దశదిన కార్యక్రమ నిమిత్తము వారి కుటుంబానికి    5000 రూపాయలు   బిఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ ఆర్థిక చేయూతను అందించారు  . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుమల రాములు  మృతి చెందడంతో ఆ కుటుంబం నిరాశ్రయులయ్యారనీ బాధితులకు అండగా నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు .ఆపద సమయంలో మానవత్వం చాటి మంచి మనసున్న మనిషిగా  చేయూతనందించినందుకు గాను ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు డొంకన రవీందర్ గౌడ్ ,పాలిక వీర స్వామి,  కారేపల్లి మండలం బీసీ నాయకుడు పేరు వెంకటేశ్వర్లు ,యువ నాయకు చింతల సంపత్ ,ఎండి ఖలీలుల్లా ఖాన్ ,  సోమందుల వెంకటేశ్వర్ ,బి ఆర్ ఎస్ మైనార్టీ  యువ నాయకుడు  షేక్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.