5 August, 2026 | 12:15 PM

హైవేపై ఆగిన కందనూల్ డిపో బస్సు

05-08-2026 10:58 AM

బిజినేపల్లి: నాగర్ కర్నూలు నుండి హైదారాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుదవారం ఆరున్నర గంటల ప్రాంతంలో షాద్ నగర్ బైపాస్ రోడ్డుపై  నిలిచిపోయింది. నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపోకు(Kandanool depot bus) చెందిన బస్సు సాంకేతిక లోపాల కారణంగా హైవేపై రోడ్డు మధ్యలోనే నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాని ప్రయాణికులు వాపోయారు. ప్రయాణికులే బస్సును తోసి పక్కకు జరిపారు. అనంతరం ప్రయాణికులను అటుగా వెళ్ళే బస్సుల్లో వారి వారి గమ్యస్థానాలకు చేర్చారు. సూదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను డిపో నిర్వాహకులు ముందస్తుగా తనిఖీలు చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు ఎదురవుతున్నాయని వాపోయారు.