చేనేత ప్రదర్శనను ప్రారంభించిన ప్రీతి పులిపాక
హైదరాబాద్: 'జగదీశ్వర్ హస్తకళ' ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, కళింగ కల్చరల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన 9 రోజుల 'హ్యాండ్ టు హ్యాండ్' చేనేత ప్రదర్శన-2026ను, 'మిసెస్ ఆసియా గ్రేట్ బ్రిటన్' రన్నరప్, టాలీవుడ్ చలనచిత్ర నిర్మాత ప్రీతి పులిపాక లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రదర్శన 2026 ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. "అందమైన డిజైన్లతో కూడిన చేతితో నేసిన కాటన్, సిల్క్ వస్త్రాలు, ప్రత్యేకమైన సిల్క్ చీరలు, చేనేత ఉత్పత్తుల కోసం వెతుకుతున్న మహిళలకు చేరువ కావడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరం." అని ప్రీతి పులిపాక అన్నారు. ఈ ప్రదర్శన నిర్వాహకుడు జయేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, చేనేత కళాకారులను ప్రోత్సహించడం, అలాగే చేనేత రంగానికి మద్దతునిస్తూ వారికి తగిన మార్కెట్ కల్పించడం ఈ ప్రదర్శన యొక్క ప్రధాన సామాజిక లక్ష్యమని తెలిపారు.






