calender_icon.png 22 February, 2026 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురాతన గ్రంథాలు, జ్ణానాన్ని పరిరక్షిస్తున్నాం: మోదీ

22-02-2026 02:05:46 PM

న్యూఢిల్లీ: భారత్ లో అతిపెద్ద ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను నిర్వహించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇది కృత్రిమ మేధస్సులో భారతదేశ నాయకత్వాన్ని ప్రదర్శించిన ఒక మైలురాయి కార్యక్రమం అని అభివర్ణించారు. ఏఐ ఇండియా ఆవిష్కర్తలను ప్రధాని అభినందించారు. ఫిబ్రవరి 16-20 వరకు ఢిల్లీలో జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశం మానవ-కేంద్రీకృత AI, న్యూఢిల్లీ డిక్లరేషన్ వంటి నైతిక చట్రాలు, ఏఐ సదస్సు నిర్వహిణ టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని, భారత్ సామర్థ్యాలకు ప్రపంచం సాక్షిగా నిలిచిందని ఆయన తెలిపారు. ఈ ఏఐ సదస్సుకు ప్రపంచ నేతలు హాజరయ్యారని చెప్పారు. ఏఐ సహాయంతో పురాతన గ్రంథాలు, జ్ణానాన్ని పరిరక్షిస్తున్నామని, గ్రంథాల పరిరక్షణ చూసి ప్రపంచ నేతలు ఆశ్యర్య పోయారన్నారు. ఏఐ ద్వారా రైతులకు 24 గంటలపాటు సహాయం అందిస్తున్నామని, అంతేకాకుండా ఏఐ ద్వారా జంతువులకు చికిత్స ప్రపంచ నేతలను ఆశ్యర్యపరిచిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. 

డిజిటల్ అరెస్టు మోసాలపై దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అతిచిన్న వయసులో అవయధానం చేసిన కేరళ చిన్నారి కుటుంబాన్ని మోదీ అభినందించారు. బియ్యం ఉత్పత్తి చేస్తున్న అతిపెద్ద చేశం భారతదేశామని, భారత సంతతి ఆటగాళ్లు తమ దేశాలకు గర్వకారణంగా నిలుస్తున్నారని కొనియాడారు. టీ 20 ప్రపంచకప్ లో ఇదే విషయం స్పష్టమవుతోందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజ సంక్షేమం కోసం పని చేసినవారు ప్రజల హృదయాల్లో నిలుస్తారని, ఈనెల 24న తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా మోదీ స్మరించుకున్నారు. జయలలిత ప్రజాదరణ పొందిన నాయకురాలని, ప్రజల్లో ఆమె పట్ల ఉన్న అభిమానాన్ని తమిళనాడులో పర్యటించనప్పుడు గుర్తించినట్లు ఆయన తెలిపారు. జయలలిత ప్రస్తావన వస్తే తమిళనాడు ప్రజల ముఖాలు వికసిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.