పదో తరగతి ఫలితాల్లో మెరిసిన మోడల్ విద్యార్థులు
సదాశివనగర్,(విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల్లో తెలంగాణ ఆదర్శ పాఠశాల సదాశివనగర్ కు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపి మంచి ఫలితాలను సాధించారు. 94 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 94 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాలను సాధించారు. ఆకుల సంజన 583 మార్కులు, ఆకుల నయన శ్రీ 581 మార్కులు, రాఘవపురం బాలాజీ 580 మార్కులు సాధించారు.
550 పైన మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 26 అలాగే 500 పైన మార్కులు సాధించిన వారు 75 మంది ఈ ఫలితాల సాధనలో విశేష కృషి చేసిన ఉపాధ్యాయులకు ఈ ఫలితాల సాధనకు సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి అద్భుత ఫలితాలను సాధించినటువంటి విద్యార్థులను గ్రామ సర్పంచ్ శిరీష రవి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కీర్తన, సభ్యులు గ్రామ పెద్దలు అభినందించినట్టు ప్రిన్సిపల్ రాజిరెడ్డి తెలిపారు.






