10 May, 2026 | 10:18 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

నెలాఖరుతో ముగియనున్న మోడల్ స్కూల్ ప్రవేశ దరఖాస్తులు

17-02-2026 07:34 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆదర్శ పాఠశాల (TG Model School, Mancherial) లో ప్రవేశాలకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉందని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న మంగళ వారం తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఈ నెల 28తో గడువు ముగియనుండటంతో ఆసక్తి గల విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

6వ తరగతిలో 100 సీట్లు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు వెబ్‌సైట్ www.tgms.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.