11 March, 2026 | 1:53 PM

Breaking News

వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

11-03-2026 12:31 AM

మేడ్చల్, మార్చి 10 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గండిపేట లోని గోల్కొండ రిసార్ట్ లో నిర్వహించిన వర్క్ షాప్ లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, వివేక్ గౌడ్, లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కృష్ణారావు, ఎమ్మెల్సీ రాజు పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు,

సభలో ప్రజా సమస్యలను సమర్థవంతంగా ఎలా లేవనెత్తాలై అనే అంశాలపై దిశా నిర్దేశం చేసినట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సభా నియమాలు, రాజ్యాంగ అంశాలు తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఇలాంటి వర్క్ షాపు లు ప్రజా ప్రతినిధులకు సభ వ్యవహారాలపై మరింత అవగాహన కల్పించి ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.