11 March, 2026 | 12:02 PM

సావిత్రిబాయి పూలే వర్ధంతిని మరిచిన నాయకులు

11-03-2026 12:30 AM

బెజ్జంకి, మార్చి10: భారతదేశంలో మహిళా విద్యకు పునాది వేసిన మహానుభావురాలు సావిత్రిబాయి పులేవర్ధంతి మార్చి ప ది రోజున సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో తాజా మాజీప్రజా ప్రతినిధులు, నాయకులు గుర్తు చేసుకోకపోవడంపై కొన్ని సామాజిక వర్గాలు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. మహిళల విద్య, సమాన హక్కుల కోసం పోరాడిన సావిత్రిబాయి పులే వంటి మహనీయురాలిని అధికారికంగా స్మరించకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పలువురు సామాజిక కార్యకర్తలు దిటీ బాలనార్స్ ,వడ్లూరిపర్శరం,చింతకింది పర్షారం లు మాట్లాడుతూ, మహిళా సాధికారత గురించి మాట్లాడే నాయకులు కనీసం సావిత్రిబాయి పులే వంటి మహనీయుల సేవలను గుర్తు చేసుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాలకు ఆమె సేవలు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.మహిళా విద్యకు అంకితభావంతో పనిచేసిన సావిత్రిబాయి పులే వర్ధంతి రోజున ఆమెకు ఘన నివాళులు అర్పిస్తూ, ఆమె ఆశయాలను కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు.