23 June, 2026 | 3:34 PM

ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలను సాగు చేస్తేనే రైతులకు బోనస్

23-06-2026 01:59 PM
  1. జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి ఆందోళన అవసరం లేదు
  2. విత్తన మేళ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు 

సుల్తానాబాద్, జూన్ 23,(విజయక్రాంతి): ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్న రకాలను సాగు చేస్తేనే రైతులకు క్వింటాల్ కు 500 రూపాయలు బోనస్ లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(Peddapalli MLA Chintakunta Vijaya Ramana Rao) అన్నారు, మంగళవారం  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైతు వేదిక లో  విజయరమణారావు  విత్తనమేళా ను ప్రారంభించారు, అనంతరం జరిగిన సమావేశంలో  ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న వరి సన్న రకాలు ఈనెల 23 నుండి నుండి 30  వరకు ప్రతీ రైతు వేదికలో విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు.

శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో, తెలంగాణ జిల్లాల్లో ఏలినీవో ప్రభావం అధికంగా ఉంటుందని, తగినంత వర్షపాతం పడిన తర్వాతనే విత్తనాలను విత్తుకోవాలనిసూచించారు.అలాగే,జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.రైతు తప్పని సరిగా సాగులో నానో ఎరువులు కూడా విరివిగావాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ , సర్పంచ్ ఓగుల పూజా , రాజేందర్  పలు గ్రామ ల సర్పంచులు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏవో పైడితల్లి ,మండల ఏఈవోలు రాజు, పద్మ, అనుష, రవితేజ, ఆనంద్ రావు, విత్తన లెసైన్సు కలిగిన డీలర్స్,రైతులు తదితరులు పాల్గొన్నారు.