2 May, 2026 | 10:33 PM

బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

02-05-2026 09:07 PM

కట్టంగూరు,(విజయక్రాంతి): చిట్యాల మండలం పిట్టంపల్లిలోని న్యోస్‌ల్యాబ్ ఫార్మా కంపెనీలో నిన్న ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలి చిన్నకాపర్తికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఫార్మా కంపెనీలు స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను లెక్కచేయడం లేదు. ఉద్యోగాలకు స్థానికులను రిఫర్ చేసినా పట్టించుకోవడం లేదు.

ఏదైనా ప్రమాదం జరిగితే నష్టపోయేది మన బిడ్డలే. యాజమాన్యం మాత్రం ఎక్కడో ఉండి బేరసారాలు ఆడుతుంది. ఇలాంటి నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించిన న్యోస్‌ల్యాబ్ కంపెనీ యాజమాన్యంపై స్థానిక ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ఉక్కుపాదం మోపారు. చనిపోయిన బాధితుడికి రూ.10 లక్షలకు మించి ఇవ్వనన్న యాజమాన్యాన్ని పట్టుబట్టి, ఎవరి ఫోన్లకు లొంగకుండా, బాధిత కుటుంబానికి రూ.1.5 కోట్ల పరిహారం ఇప్పించారు. ఎమ్మెల్యే చొరవ నిజంగా హర్షణీయం.