25 April, 2026 | 4:47 PM

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

25-04-2026 03:04 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): కడెం మండలంలో 61 కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఖానాపూర్ ఎమ్మెల్యే  వెడ్మ బొజ్జు పటేల్ శనివారం లబ్ధిదారులకు అందజేశారు కడెం మండలంలోని 61 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని, మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఉచిత బస్సు, మహిళా సంఘాల ద్వారా రుణాలు, ఆర్టీసీ బస్సుల కొనుగోలు కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, లబ్దిదారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.