21 June, 2026 | 7:02 PM

వన మహోత్సవంలో పాల్గొన్న నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి

21-06-2026 04:57 PM

వెల్దుర్తి,(విజయక్రాంతి): ఆదివారం వెల్దుర్తి మండలంలో జలాల్పూర్ గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళికామాత దేవాలయం వద్ద ప్రత్యేక పూజలో పాల్గొని దేవాలయం వద్ద నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వివిధ మండలాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ నక్షత్రం ప్రకారం మొక్కలను నాటడం జరిగింది. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి  నక్షత్రంతో ఉన్న మొక్కను నాటి వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు.