21 June, 2026 | 8:19 PM

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: జనగామ లక్ష్మణ్

21-06-2026 06:12 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): యోగా చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని యోగ శిక్షకులు జనగామ లక్ష్మణ్,బొజ్జ కళావతి అన్నారు. ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రపంచ యోగ దినోత్సవం నిర్వహించారు. సందర్భంగా యోగా శిక్షకులు యోగ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగ చేయడంతో నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, బిపి, షుగర్, ఊపిరితిత్తుల సమస్యలు, తదితర సమస్యలు సైతం నయమవుతాయని ప్రతినిత్యం ఉదయం 6:00 నుండి 7 గంటల వరకు ఆయుష్మాన్ భారత్ యోగ కేంద్రంలో యోగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.