21 June, 2026 | 8:20 PM

కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

21-06-2026 06:27 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధి గా ప్రముఖ హార్ట్ ఫుల్నెస్ నిపుణులు కనకదుర్గ పాల్గొని  యోగ ఆవశ్యకతను  విద్యార్థి నులకు, విపులంగా వివరించారు.

యోగ ఆవశ్యకతను వివరిస్తూ  యోగ అంటే జీవితాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవడం అని, మానవాళికి అందుబాటులో ఉన్న అతి  పెద్ద భాగ్యం యోగ అని, యోగ సంతోషాన్ని, సౌఖ్యాన్ని కూడా ఏక కాలం లో అందిస్తుందని, యోగ ఆసనాలు  ఒత్తిడిని దూరం చేస్తాయని వివరించారు. కిట్స్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థి నులు యోగ ను దిన చర్య గా పాటించాలని, యోగ తోనే సంపూర్ణ ఆరోగ్య వంతులు గా ఉంటారని అన్నారు.