30 April, 2026 | 6:38 PM

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మొక్కజొన్న కొనుగోలు

30-04-2026 05:12 PM

మొక్కజొన్న నిల్వ గోదాం ను సందర్శించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్...

కారేపల్లి,(విజయక్రాంతి): మొక్కజొన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని దానికి అనుగుణంగానే మండలంలో సొసైటీ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. మండల పరిధిలోని ఆప్పాయిగూడెం గూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల మార్క్ఫెడ్ గోడౌన్ నందు మొక్కజొన్నల నిల్వ కేంద్రాన్ని గురువారం పరిశీలించారు.

ఇటీవల మండల పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్యే కు రైతులు వద్దనుండి కొనుగోలు చేసే మొక్కజొన్న లారీ లోడ్స్ నిలువ చేసేందుకు ఇబ్బందికరంగా ఉందని విషయాన్ని తెలుసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సబ్ కలెక్టర్కు ఫోన్ ద్వారా సమస్యను వివరించడంతో మార్కెట్ గోడౌన్ లో మొక్కజొన్నలు నిలువ చేసుకునేందుకు అనుమతినిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి మండలం లో సుమారు 8000 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట సాగు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2400 రూపాయలకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తుంది అన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని మరల వర్షం పడితే రైతుల ఇబ్బందులు పడతారని ఉద్దేశంతో ఖాళీ ప్రదేశాల్లో  అరబోసిన మొక్కజొన్నలను గోడౌన్ లోకి చేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు