1 June, 2026 | 7:51 PM

పూర్తిస్థాయిలో వడ్లు కొనుగోలు చేసినట్లయితే అభివృద్ధి చేసినట్లే

01-06-2026 06:42 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): పూర్తిస్థాయిలో వడ్లు కొనుగోలు చేసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లేనని నాగిరెడ్డిపేట్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. సోమవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని రాంప్రతాప్ థియేటర్లో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య నాయకులతో, కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మొన్న రెండు రోజుల క్రితం మాజీ మంత్రివర్యులు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మరియు వివిధ ఎమ్మెల్యేలతో కలిసి కన్నారెడ్డి, మాల్తుమ్మెద గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. 

సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధిని బిఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని తెలుపడం జరిగిందన్నారు. దానికి అనుగుణంగా సోమవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు మాట్లాడుతూ... బిఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డిపేట్ మండలంలో ఎక్కడ అభివృద్ధిని అడ్డుకుంటున్నారో నిరూపించాలని, పూర్తిస్థాయిలో వడ్లు కొనుగోలు చేసినట్లయితే అభివృద్ధి చేసినట్లేనని తెలిపారు.

జూన్ 5 లోపు వడ్లు కొనుగోలు పూర్తి చేసినట్లయితే బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు పాలాభిషేకం చేస్తామని లేనిఎడల జూన్ ఆరవ తేదీన రైతుల సమక్షంలో పెద్ద ఎత్తున ధర్నాకు సిద్ధమవ్వడానికి రెడీగా ఉన్నామన్నారు. అలాగే గత వర్షాకాలంలో తెగిపోయినటువంటి పటేల్ చెరువుకట్ట, నాగిరెడ్డిపేట్ బ్రిడ్జి, పోచారం ప్రాజెక్టు ప్రధాన బ్రిడ్జి పనులు, నాగిరెడ్డి పేట మండలంలో మొదలగు ఎలాంటి అభివృద్ధిని అడ్డుకున్నామో మీరు ఎలాంటి అభివృద్ధి చేశారో నిరూపించాలని విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తున్నామన్నారు.