పీర్జాదిగూడలో ఘనంగా బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవం
01-06-2026 06:45 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): పీర్జాదిగూడలో నిర్వహించిన బీరప్ప కామరాతి కల్యాణ మహోత్సవంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆర్.వి. ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి పాల్గొని, మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ... బీరప్ప కామరాతి కల్యాణ మహోత్సవం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయి. యువత మన ఆచారాలను, సంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ప్రజలందరికీ బీరప్ప స్వామి ఆశీస్సులు లభించి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను అని అన్నారు.






