ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం, ఆగ్రోస్ చైర్మన్ కాసుల
25-05-2026 09:27 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యాలయం ( ADA ) లో ఆత్మ కమిటీ చైర్మన్,సభ్యుల పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజులు హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ గా మాసాని రవీందర్ రెడ్డి,కమిటీ సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసుల బాలరాజులను నూతన కమిటీ సభ్యు లు సన్మానించారు.






