బొడ్రాయి ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే
01-07-2026 01:40 AM
కేసముద్రం, జూన్ 30 (విజయక్రాంతి): కేసముద్రం మండలం తావుర్యా తండా గ్రామంలో మంగళవారం నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భుక్య మురళి నాయక్, డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి భుక్య ఉమ పాల్గొని బొడ్రాయికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.






