1 July, 2026 | 4:03 AM

పట్టుబడ్డ 296.31 కిలోల గంజాయి దహనం

01-07-2026 01:39 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 57 కేసులకు సంబంధించిన 296.31 కిలోల డ్రై గంజాయి, 964 గంజాయి మొక్కలను ఎన్డీపీఎస్ చట్టం నిబంధనల ప్రకారం ఇన్సినిరేషన్ విధానంలో దహనం చేశారు.

వీటి విలువ సుమారు రూ.1.70 కోట్లు ఉంటుందని జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) చిత్తరంజన్, ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, ఇన్స్పెక్టర్లు రవీందర్, బాలాజీ వరప్రసాద్, శ్రీనివాస్, వేణుగోపాల్, ఎస్‌ఐలు సుధాకర్, మహేందర్, వెంకట కృష్ణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.