10 March, 2026 | 2:57 PM

10 కోట్లతో 10,000మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో వ్యవసాయ గోదాం

09-03-2026 02:00 PM

 ప్రారంభించిన ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్ 

దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ పట్టణంలోని 11వ వార్డులో సోమవారం శేరిపల్లి రోడ్డు  దగ్గర రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ నిధుల నుండి మంజూరైన 10కోట్ల రూపాయలతో 10, 000మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నూతనంగా నిర్మించనున్న వ్యవసాయ గోదాం నిర్మాణ పనులకు రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు తో కలిసి ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు

 ఈ సందర్భంగా మాట్లాడుతూ  రైతులకు మౌలిక వసతులు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు మరియు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సదుపాయం కల్పించడంలో ఈ గోదాం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.గోదాం నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు