18 April, 2026 | 3:16 PM

చలివేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి

18-04-2026 01:39 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పాత సెంటర్ లో, బస్ స్టాండ్ రింగ్ సెంటర్,  ప్రభుత్వ ఆసుపత్రి ముందు " చలివేంద్రం " ను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు. పెనుబల్లి మండలం, అడివి మల్లెల గ్రామం లో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి,  మధర్ యూనిట్ ద్వారా ఎస్ హెచ్ జి మహిళలకు " పెరటి కోళ్లు " ఫామ్ ను ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ప్రారంభించారు.  

రూ.3 లక్షలు యూనిట్ కాస్ట్ తో పెరటి కోళ్లు పొందిన డ్వాక్రా గ్రూపులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్య మంత్రి  రేవంత్ రెడ్డి  మహిళలను కోటీశ్వరాలను చెయ్యటం కోసం ఇందిరా మహిళా శక్తి ద్వారా డ్వాక్రా మహిళలకు తోడు గా ఉంటున్నందుకు మన అందరి తరుపున ధన్యవాదములు తెలియజేశారు.  ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ కమీషనర్ నరసింహ, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, సత్తుపల్లి ఏఎంసి చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు,కౌన్సిలర్స్ ప్రభాకర్ రెడ్డి, గ్రాండ్ మౌలాలి, హకీమ్, దేవి శ్రీను,జగన్నాధం శ్రీను,విరివాడ అపర్ణ భూషణం,దూదిపాల రాంబాబు, కర్నాటి విజయ లక్ష్మి, నసీమ షరీఫ్,పర్స మానస రాము, సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, ఎన్ ఎస్ యు ఐ.నాయకులు, ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వర రావు,పెనుబల్లి  ఏపిఎం, డీపీఎం, ప్రెసిడెంట్ లీలావతి, శేఖర్, కొల్లి రాజా, రమేష్ మరియు గ్రామస్తులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులు, మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.