15 March, 2026 | 11:28 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

మహంకాళి జాతర వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

09-03-2026 03:38 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సోమవారం మహంకాళీ జాతర గోడ పత్రికలను ఆవిష్కరించారు. రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థానంలో ఏప్రిల్ 2, 3 తేదీలలో నిర్వహించనున్న మహంకాళీ జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆమె తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జాతర ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యేకు వివరించారు. జాతరను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వహించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, ఆలయ అధ్యక్షుడు మోడెం తిరుపతి గౌడ్, ఆలయ ప్రధాన అర్చకుడు దేవార వినోద్ స్వామి, దుర్గం తిరుపతి, మిట్ట వెంకటేష్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.