1 June, 2026 | 2:22 PM

Breaking News

బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్..   •   డాక్టర్ కళ్యాణికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు సన్మానం   •   విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి   •   నెల చివరి వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు   •   రామంతాపూర్‌లో RTC బస్సును ఢీకొట్టిన కారు   •   పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ   •   ఆయిల్ పామ్ నర్సరీలో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేయాలి   •   అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క   •   BRS నేతల ముందస్తు అరెస్టులు.. అప్రజాస్వామికం   •   సీఎం జనజాతర సభకు మార్లవాయి గ్రామస్తుల భారీ తరలింపు   •  

పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ

01-06-2026 01:43 PM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి):  ఆసిఫాబాద్ మండలంలోని కౌటగూడ గ్రామంలో నిన్న పిడుగుపాటుకు మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే  కోవ లక్ష్మీ పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.కుటుంబానికి జరిగిన తీరని నష్టంపై విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.