25 May, 2026 | 10:23 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

25-05-2026 09:13 PM

- ఇల్లందు పురపాలకం అభివృధ్ధికి రూ.50 కోట్ల  నిధులు కెటాయించాలని వినతి

ఇల్లెందు,(విజయక్రాంతి): రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం తెలంగాణ రాష్ట డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  సచివాలయంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఇల్లందు పురపాలక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినటువంటి హామీలు వారి దృష్టికి తీసుకెళ్లారు.

కాంగ్రెస్ పార్టీ పురపాలక ఎన్నికలలో  గెలిచిన తీరును వారికి విన్నవించి  పురపాలకం అభివృద్ధి కొరకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రధానంగా పురపాలకంలో అండర్ గ్రౌండ్ డ్రైనెజ్, వాటర్ పైప్ లైన్, నీటి శుధ్ధికరణ, పురపాలక శుధ్ధికరణకు ఆధునిక పరికరాలు, రోడ్లు, కల్వర్ట్ల ఆధునికరణ, నూతన నిర్మాణాల మంజూరితో పాటు, నిధులు మంజూరి చేయాలని కోరారు.