నిందితులను కఠినంగా శిక్షించాలి
25-05-2026 08:22 PM
అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ నర్సింగోజు నరేష్ కుమార్
మేడిపల్లి,(విజయక్రాంతి): నిందితులను కఠినంగా శిక్షించాలని అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ నర్సింగోజు నరేష్ కుమార్ అన్నారు. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్యకు నిరసనగా సోమవారం మేడిపల్లిలో ఉప్పల్ కోర్ట్ కాంప్లెక్స్ ఆవరణలో న్యాయవాదుల ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ అత్యంత ఘోరంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.






