18 April, 2026 | 9:25 PM

Breaking News

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

18-04-2026 08:20 PM

సర్టిఫికెట్లు అందించి అభినందించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

బోయినపల్లి,(విజయక్రాంతి): జాతీయ రహదారి భద్రతా (రోడ్ సేఫ్టీ) మాసోత్సవాల  సందర్భంగా భాగంగా వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించారు. జాతీయ రహదారి భద్రతా (రోడ్ సేఫ్టీ) మాసోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆద్వర్యంలో  ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు,  వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు చేయించారు. అలాగే జిల్లాలోని పలు విద్యాసంస్థల విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా చర్యలపై వ్యాస రచన, క్విజ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించగా, పలువురు విద్యార్థులు ప్రతిభ చూపారు. 

ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించారు. వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా చర్యలపై కుటుంబ సభ్యులకు, సమీప ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ కుమార్, వివిధ పాఠశాలల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.