18 July, 2026 | 6:22 PM

Breaking News

అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •   ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •   మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •  

హెచ్‌పీవీ టీకా ప్రారంభించిన ఎమ్మెల్యే జారె

09-03-2026 12:00 AM

ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం

అశ్వారావుపేట, మార్చి 8 (విజయక్రాంతి): అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్పీవీ  టీకా కార్యక్రమాన్ని  స్థానిక ఎమ్మెల్యే  జారె ఆదినారాయణ ఆదివారం ప్రారంభించారు . మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ వ్యాధిని ముందుగానే నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ టీకాను ఉచితంగా అందిస్తున్నది. 

ఈ సందర్భంగా యుక్త వయస్సు బాలికలకు స్వయంగా టీకాలు అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని ఆయన సూచించారు. గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధి రాకుండా ఉండేందుకు ఈ హెచ్పీవీ టీకా ఎంతో ఉపయోగకరమని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సేవలు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 

ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశం

 అసుపాక, తిరుములకుంట, ఆనంతారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమం లో పాల్గొని , గృహలబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతారం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, పెద్దవాగు ప్రాజెక్ట్ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలను సందర్శించారు. అన్ని సదుపాయాలు ఉన్నాయా, లేవా అని అడిగి తెలుసుకున్నారు.

10వ తరగతి విద్యార్ధులు  ఇష్టపడి చదివి మంచి ర్యాంకులు  సాధించాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో  ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు , మున్సిపల్ చైర్ పర్సన్ జూపల్లి శశికళ , వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ , మెడికల్ స్పెషల్ ఆఫీసర్ మౌనిక , వినాయకపురం స్పెషల్ ఆఫీసర్ రాందాస్ , సిహెచ్‌ఓ అమరావతి , హెచ్ వి దుర్గ , హెచ్ ఏ లు గోపాల్ , ప్రసాద్ , సతీష్ ,  ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.