18 July, 2026 | 5:57 PM

Breaking News

వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •   ప్రజలు పరిశుభ్రంగా ఉండాలంటే వ్యర్థ పదార్థాలు వేరు చేయాలి   •   గోదావరి పుష్కరాల నాటికి ఆలయ నిర్మాణం పూర్తి   •   ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావుకు కృతజ్ఞతలు తెలిపిన చిలుక సతీష్   •  

పాత జ్ఞాపకాలతో సింగరేణి సీఎండీ

09-03-2026 12:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 8, (విజయక్రాంతి): ఇటీవలే సింగరేణి సంస్థ చైర్మన్ మరియు యండి గా నియమితులైన డా. బుద్ధ ప్రకాష్ జ్యోతి కొత్తగూడెం ఏరియా పర్యటన సందర్భంగా, 2007లో తాను ఐటిడిఏ భద్రాచలం ప్రాజెక్టు అధికా రిగా పనిచేసిన కాలంలో గిరిజన విద్యా కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసిన డా. ప్రభుదయాల్ గృహాన్ని ఆయన  సందర్శించారు. ఆయన బాగోగులు తెలుసుకున్న అనంతరం ఇటీవలే ఆయన కుమారుని వివాహం జరిగినందున నూతన వధూ వరులను ఆశీర్వదించారు.

డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన కాలంలోనే గిరిజన విద్యా కళాశాల గణనీయమైనా ప్రగతి సాధిం చింది. జాతీయ ఉపాధ్యాయ మండలి న్యూఢిల్లీ ప్రత్యేక గుర్తింపు, బిఇడి 200 సీట్లు, నూతన 3 బ్లాక్ భవనాల మంజూరు, కంప్యూటర్ లాబ్, గ్రంథాలయ ఏర్పాటు, ఇగ్నో స్టడీ సెంటర్ ఏర్పాటు వంటివి ఆయన హయంలోనే జరిగాయి. వాటిన న్నింటినీ గుర్తు చేశారు. కళాశాల అభివృద్ధి పట్ల నాడు దయాల్ చూపిన ప్రత్యేక శ్రద్ధను ఆయన ఙప్తికి తెస్తూ నేడు దయాల్ ను అభినందించారు.  సింగరేణి సంస్థ సిఎండి అయినందున దయాల్ కుటుంబ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు.