27 February, 2026 | 6:53 PM

మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధికి పునాది

27-02-2026 03:06 PM

ఇందిరా మహిళా శక్తి గ్రామ దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మహిళలలు ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధికి పునాది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. శుక్రవారం నాబార్డ్ ఆర్థిక సహకారంతో, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ నగరంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి గ్రామ దుకాణం ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు స్వయంగా తయారు చేసిన పల్లె ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, హస్తకళా వస్తువులకు మార్కెట్ వేదిక కల్పించడం ద్వారా వారి ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందన్నారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా, సమాజంలో గౌరవ స్థానాన్ని సంపాదించుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. 

మహిళా శక్తి – రాష్ట్ర శక్తి  అనే నినాదంతో ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మైత్రి యాదయ్య,  మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.