27 February, 2026 | 5:02 PM

మార్చి 1 న కరీంనగర్‌లో ఉద్యమకారుల కృతజ్ఞత సదస్సు

27-02-2026 03:10 PM

మంథనిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి

మంథని,(విజయక్రాంతి): మార్చి 1న కరీంనగర్ లో నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యమ కారుల కృతజ్ఞతా సదస్సు విజయవంతం  చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ లో మంథని నియోజక వర్గం ఇంచార్జీ గోగుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మాట్లాడుతూ... ఉద్యమకారులకు బాసటగా నిలుస్తామని ప్రజా ప్రభుత్వం హామీ ఇవ్వడం హర్షనీయమని, ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారునికి ప్రభుత్వం వెంటనే సంక్షేమ పథకాలు అందించాలని, ఉద్యమకారులను గుర్తించి వారికి పెన్షన్ తో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని  ప్రజా ప్రభుత్వాన్ని కోరారు.

ఈ విషయమై కరీంనగర్ లో కృతజ్ఞతా సదస్సును ఏర్పాటు చేస్తున్నామని, ఈ సదస్సు కరీంనగర్ లోని అమరవీరుల స్తూపం నుండి ప్రెస్ భవన్ వరకు కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క ఉద్యమకారుడు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం, మంథని విజయ్ కుమార్, గుర్రం దేవేందర్, రాష్ట్ర కార్యదర్శి బత్తుల శంకర్,  మంథని మండల అధ్యక్షుడు కాసిపేట సాంబయ్య, ప్రధాన కార్యదర్శి జాడి జంపయ్య, ఉపాధ్యక్షుడు కొండల సమ్మయ్య సీనియర్ ఉద్యమ నాయకుడు రొడ్డ లింగయ్య జమ్మిడి కొండయ్య  తదితరులు పాల్గొన్నారు.