సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే
టేకులపల్లి, ఏప్రిల్ 14, (విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) చెక్కులను ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం లబ్దిదారులకు అందజేశారు. టేకులపల్లి కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 73 మంది లబ్దిదారులకు రూ.17,19 లక్షల విలువగల చెక్కులను స్థానిక నాయకులతో కలిసి లబ్దిదారులకు పంపిణీ చేసారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన నిరుపేదలకు మెరుగైన వైద్యం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు వైద్యం ఖర్చులు భారం కాకుండా ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బంధుల్లో ఉన్నపటికీ, పేదవాని కన్నీళ్లు తుడిచే ప్రక్రియలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ.. నేడు ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంతన్న పాలన రాష్ట్రం లో పేదల పక్షాన ఉన్నదని ఈ సందర్బంగా తెలుపుటకు గర్వ కారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, యువజన నాయకులు, లబ్దిదారులు పాల్గొన్నారు.






