బాబా ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి
29-07-2026 03:39 PM
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
గణపురం,(విజయక్రాంతి): బాబా ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ లతో కలిసి అభిషేకః నిర్వహించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు వినయ్ నిర్వహించారు. తీర్థ ప్రసాదాల అనంతరం దుగ్యాల ఆగమ రావు, అమృతమ్మ, నారాయణరావు స్వరూప దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.






