గురు పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే సతీమణి లక్ష్మి
29-07-2026 03:47 PM
ఇల్లందు,(విజయక్రాంతి): గురు పౌర్ణమి సందర్భంగా ఇల్లందులోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణి లక్ష్మి పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ ఉల్లింగ విజయలక్ష్మితో కలిసి మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం స్వామివారి ప్రసాదం స్వీకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు. కార్యక్రమం భక్తి పారవశ్య వాతావరణంలో ఘనంగా జరిగింది.






